కరిగించే మా కండబలం
మా కార్చిన ఘర్మజలం
ప్రపంచైక్య కార్మికులం
మేడే లాల్ సలాం..!
#రాఖీ రవ్వలు
పరిమళ పూవనం
ప్రజ్వల హవనం
ప్రకటిత జీవనం
అవిరళ కవనం..!
#రాఖీ రవ్వలు
ఇదా జీవితం.!
ఇదీ జీవితం.,
ఇదో జీవితం?!
ఇదే జీవితం..!!
#రాఖీ రవ్వలు
చీరను పట్టిచూడు
కుండను కొట్టిచూడు
గుండెను తట్టిచూడు
గీటురాళ్ళే అన్నీ..!
#రాఖీ రవ్వలు
తెలిసి వస్తే
తెలివి వస్తే
తెరలుతొలిగితే
ఉగ్రవాద విరోధం..!
#రాఖీ రవ్వలు*
వాహ్ఁ.,
మనం
మనవామన కవనం
రూపుకొంచం భావన ఘనం..!
#రాఖీ రవ్వలు
ఓ సీత
ఓ భూమాత
ఇంట్లోనే
సహనశీలి ఇల్లాలు!
#రాఖీ రవ్వలు
ఓంకారం జగతికి
శ్రీకారం ప్రగతికి
ప్రాకారం ప్రకృతికి
నమస్కృతి గణపతికి..!!
#రాఖీ రవ్వలు
రవ్వ దోస
రవ్వ కేసరి
రవ్వల నెక్లెస్..
రవ్వలే రవ్వలు..!
పరిమళ పూవనం
ప్రజ్వల హవనం
ప్రకటిత జీవనం
అవిరళ కవనం..!
#రాఖీ రవ్వలు
ఆకలి తీర్చే మెతుకులు
చేజాచనీయని ఖర్చులు
సేదదీర్చెడి ఆరడుగులు
బ్రతుకున పసిడి గనులే..!
#రాఖీ రవ్వలు
ఆదరిస్తే అమ్మలు
ప్రదర్శిస్తే బొమ్మలు
పద్ధతికి పట్టుగొమ్మలు
భారతీయ పడతులు..!
#రాఖీ రవ్వలు
రవ్వలు
బ్రతుకు దివ్వెలు
ఐతేనె సార్థకత..
కవనమంటే జీవనమే..!!
మట్టి అక్షరాలు
మలిస్తే శిల్పాలు
ఏమరిస్తే శిథిలాలు
నైపుణ్యం సాంతం..!
కన్నవారి సంస్మరణ
స్మృతి శాశ్వతీకరణ
సముచిత వితరణ
పురస్కార బహుకరణ..!
#రాఖీ రవ్వలు
మనసు మించని మతం
గడప దాటని కులం
మానవతకే హితం
విశ్వప్రేమ మహితం
#రాఖీ రవ్వలు
ప్రతిభ గుర్తింపు
ప్రావీణ్యతా ప్రశంస
పురస్కార స్వీకారం
గురుతర బాధ్యత..!
#రాఖీ రవ్వలు
మనిషి ప్రాణం
ఎంత హీనం
రెండుపళ్ళ కొలమానం.,
రివాజే ప్రభుత మౌనం..!
#రాఖీ రవ్వలు
మరణం నాకేనా..
ప్రపంచానికీ..
నాకు సంబంధించి
ఆత్మకు చావులేదు..!
#రాఖీ రవ్వలు
బ్రాందీ షాపుకీ
గాంధీ పేరే
జాతిపిత కదా
పితృభక్తి..!!
#రాఖీ రవ్వలు
పద పటాటోపం
రూప ఆర్భాటం
కాదు కవనం..
అది ఎద భావ చిత్రణ..!
#రాఖీ రవ్వలు
వాన పడ్తుంది
ఎండకొడ్తుంది
చలి పెడ్తుంది
ఎంత మంచిదో శీతాకాలం..!
#రాఖీ రవ్వలు
కురిసే వర్షం
మెరిసే కిరణం
హరివిల్లు ఆవిష్కరణం..
ప్రకృతి చిత్రమే..!
#రాఖీ రవ్వలు
గరాటు ఏకోన్ముఖ సూచీ..
తరాజు వ్యక్తిత్వాన్ని తూచీ..
పట్టకం దృక్కోణం విస్తృత పరచీ
కాదేదీ బోధ కనర్హం..!
#రాఖీ రవ్వలు
రెక్కలతో ఎగిరితే
మబ్బులదాకే
ఊహకు ఊతమెందుకు,
గగనాలనధిగమించు..!
#రాఖీ రవ్వలు
దాదాపు ఒకే భావాన్ని వివిధ లఘు కవితా ప్రక్రియల రూపాల్లో...byడా. రాఖీ
రవ్వలు(Designed by BHUPATHI RAJU)
సత్వర పతనమే
నియంతలైతే
ప్రజాస్వామ్యంలో..
ఓటే ఆయుధం..!
*** *** ***
నియంత హత్య,
ఆయుధం ఓటే..!
ఇది 'లబ్ డబ్'Designed by డా.రాఖీ(me)
*** *** *** ***
జగమంతా
నియంత
పాలనలో
పాదాక్రాంతం..
ప్రజాస్వాయంలో
ఓటే బ్రహ్మాస్త్రం..!
రెక్కలు Designed by సుగమ్ బాబు
*** *** *** ***
ఎంతటి నియంత లైతేనేం..!
దుంప తెంచదా ఓటే ఖడ్గమై.,ప్రజాస్వామ్యంలో..!!
(ఫెంటో Designed by Arun Rajam)
*** *** *** ***
నియంత
పతనం
ఓటు
గుణపాఠం
నానో- Designed by Ega HANMAN
*** *** *** ***
నియంతృత్వం
సాగినంతకాలమే
ఓటుకి చోటుంటే
సమూల ఖననమే..!
నానీ Designed byడా.ఎన్.గోపి
*** *** *** ***
ఓటు పోటే చాలు,నియంతలైనా నిర్వీర్యులవరూ..!
ఏక వాక్య కవిత by డా.ఆచార్య ఫణీంద్ర
*** *** **** ***
మూల భావన by శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు
సమస్యలు
నీకేనా
సోషల్మీడియాలోకి
చొరబడు
చెఱపకనే గీత చిన్నదౌతుంది.,
పెద్దగీత గీస్తే..!!
>< రాఖీ రెక్కలు
ఎన్నికలవే
నేతలూ వాళ్ళే
పార్టీలుమారుతూ
గురివిందలౌతూ..
దేశానికి దిక్కులేదు
ఓటరుకి చక్కిలేదు..!
#రాఖీ రెక్కలు
విద్య
వైద్యం
న్యాయం
వ్యవ'సాయం'
మృగ్యమై
వధ్యశిలలుగా
#రాఖీ 'రెక్కలు'
తనుగా అక్షరం
అర్థరహితం
మరోఅక్షరంతో
చేసినపుడె మైత్రి
అచ్చరమచ్చరంగా
పదమై ఏలుతుంది ధరిత్రి..!
#రాఖీ రెక్కలు
రవి కమలం
భువి భ్రమరం
అవినాభావ
అనుబంధం.,
గతి తప్పితే
అధోగతే..!
#రాఖీ రెక్కలు
వ్యక్తులే వేరు
తల్లులంతా ఒకటే
మమతానురాగాలు
సేమ్ టు సేమ్..
ఆడవారినావహించే
అమ్మతనం దైవత్వం..!
#రాఖీ రెక్కలు
నిత్యానుష్ఠానం
జ్వలిత
హవనం
కవనం
చితివరకూ
గతితప్పక!!
#రాఖీ రెక్కలు
నింగిలో
హరివిల్లో
ముంగిల్లో
రంగవల్లో
కనువిందు పందెం
గెలుపు ప్రకృతిదో పడతిదో..!
#రాఖీ రెక్కలు
అవిటితనం
మనసు'కుంటే
మనిషి
అష్టావక్ర..
సుందరుడైనా
చందురుడైనా..!
#రాఖీ రెక్కలు
పచ్చని చెట్టు
తేనె పట్టు
చిన్ని పిట్ట
ఎత్తు గుట్ట..
అన్నీ గురువులే
నేర్చుకో గలిగితే..!
#రాఖీ రెక్కలు
వానా రాదు
ప్రాణమూ పోదు
ఆవిరైన కంట
కన్నీరూ కరువే.,
దుర్భిక్షం
స్వయంకృతాపరాధం!!
#రాఖీ రెక్కలు
కవులకోసం
విమర్శకులకోసం
విబుధులకోసం
దీర్ఘ కవిత..
నా లఘు కవిత
సామాన్యుడి జత..!
#రాఖీ రెక్కలు
వాన
మాను
పరస్పరం
ప్రాణాధారం.,
పర్యావరణం
ప్రకృతి వలయం..!
#రాఖీ రెక్కలు
మంచి
చెడు
ఇదమిద్ద
రహితాలు..
దేశకాల పరిస్థితులు
కొలమానాలు..!
#రాఖీ రెక్కలు
పాలూ, నీళ్ళూ
ఒకటే రేటు
ఉప్పు ,చక్కెర
అదే రూటు
భరతావని
రైతు గ్రహపాటు..!
#రాఖీ రెక్కలు
శుభముహూర్తాలు
మేళతాళాలు
వేదమంత్రాలు
కంఠసూత్రాలు..
మనసులకు ముడులు
భవితకు బంగరు అడుగులు..!
$రాఖీ రెక్కలు
వానాకాలం వరదలు
ఎండాకాలం కరువులు
చలికాలం జలుబులు
కాలం ఓ మాయాజాలం
ఎదురీదాలి
కొట్టుకపోకుండా..!
#రాఖీ రెక్కలు
లాలి పాటలు
గోరుముద్దలు
ఓనమాలు దిద్దడాలు
త్యాగాలు ప్రేమలు
ఎవరి అమ్మైతేనేం
అందరి కథ ఒక్కటే..!
#రాఖీ రెక్కలు
కులమతాతీతుడు
ప్రకృతి ప్రేమికుడు
సమసమాజ హితుడు
మానవతా దీపకుడు
రేయింబవళ్ళ రవి
వికాస దిక్సూచి కవి
#రాఖీ రెక్కలు
అదృష్టం
ఎండమావి
శ్రమతత్వం
ఊటబావి..
దప్పిక తీర్చేది
ఓపికే..!
#రాఖీ రెక్కలు
రెక్కలకష్టం
పక్షులు ఎగరడానికి
మనుషులు ఎదగడానికి
పంకా తిరగడానికి
కష్టేఫలి
సృష్టి వైఖరి..!!
#రాఖీ రెక్కలు
బంధాలు
పలుచనౌతు
సంబరాలు
పెట్రేగుతు..
రాశి పెరిగి
వాసి తరిగి..!
#రాఖీ రెక్కలు
ఆశ
ఆకాశం
నిరాశ
పాతాళం
స్వర్గం ఆచూకి
గగనంలోనే..!!
#రాఖీ రెక్కలు
కదలివస్తోంది
కరోనా బిరానా
రైళ్ళువిమానాలు
ఎర్ర బస్సుల్లో
ఎవడి చావు వాడే
కేర్లెస్గా చావండెహే..!
#రాఖీ రెక్కలు
జుట్టు
కాళ్ళు
ఏరు
తెప్ప
సామెత పాతే
రాజకీయాల్లో రోతే..!
#రాఖీ రెక్కలు
ఏ ఎద్దు
ఎటులాగినా
తిరిగేది
పరిధిలోనే
దాంపత్యం
ఓ గానుగ..!
#రాఖీ రెక్కలు
రెక్కలు విరిచిన
బాలలు
రెక్కలుడిగిన
వృద్ధులు..
పెరిగుతున్న ఆశ్రమాలు
అమానవీయ ఆనవాళ్ళు..!
#రాఖీ రెక్కలు
Comments
Post a Comment