కోయిల

కలహంస

పాటకు ఆటకు

దీటెవరు


ప్రకృతి

కళావేదిక



ఆకులురాలితె

చప్పుళ్ళు

ఆశలు రాలితె

వెక్కిళ్ళు


చిగురిస్తాయిలే

మానూ మేనూ!!



వాన

లోకాన

పెరిగితే వరద

అలిగితే కరువు


కలతల వలలో

కృషీవలుడు



ప్రశ్నే సమాధానం..!

పరిష్కారం లేని సమస్యలకు..!!



బహిర్భూమి బాలికల కలే..!

వసతీయలేని ప్రభుతలు మరీచికలే..!!



కవులేనా కవిత్వం చెప్పడం..!

వస్తువూ కవై పాఠకుల్ని పలుకరించదూ..!!



వెనిజులా డబ్బు నీళ్ళప్రాయం..!

చెన్నైలో నీళ్ళూ డబ్బుకన్న ప్రియం..!!



ప్రశంస ఎంతో అవసరం!

ఆత్మ న్యూనత నుండి ఎదగటానికి



వర్షం పంట పొలంలో

హర్షం రైతు జీవితంలో!!


మన గమనం ఆనందంవైపు

తొందరరెందుకు తడబడుతూ చేరేలోపు!!


Comments

Popular posts from this blog