నా నానా 'నానీలు'
అదోవింత కాదు
ఆడదే!
తల తిప్పకు
మెడ పట్టుకుంటుంది!!
రోజూ విప్పలేని
పజిల్ !
మా ఆవిడ అర్థం కాని
తియ్యటి గజల్!!
క్రీగంటి కాటుకా!
దేవదాసు లెందరిని
మాడ్చి మాడ్చి
మసి చేశావో!!
వేయించుకుంటారు
ఒంటిపై ‘టట్టూ’
దాపరికమే
లేదనేటట్టూ!
సినీతార మాత్రం
కాదు లోభి
ఉదారంగా
చూపెడుతుంది నాభి!
మీకు బొత్తిగా
లౌక్యం లేదండి!
అందుకే కదా
నిన్ను కట్టుకుంది!!
ప్రేమించామని
గొంతులుకోస్తారు
కామాంధులు
కాదంటే ఆసిడ్ పోస్తారు
చెలీ నే కొన్నది
నువు కట్టుకొన్నది
ఆచీర నాఎదనా
కట్టుకొన్నది!!
మా రమా
ఎపుడూ నీదయ కోరమా
భవసాగరమీద
మాకిక భారమా
రువ్వే
నవ్వులు
గుభాళించే పువ్వులు!
ప్రభాసించే దివ్వెలు!!
ప్రేమంటే ఏమంటే
ఆరని మంటే
అంటుకుంటే
బ్రతుకు కుంటే!
తిడ్తె ప్రేమే
గేలి జాలే
ఈర్ష్య కీర్తెరుగుటే
ఇదే థింక్ పాజిటివ్ అంటే!
జానపదం
ఆనంద పథం!
బతుకమ్మలు బొడ్డెమ్మలు
వాకిట్లో గొబ్బెమ్మలు!!
RAMKISHAN RAKI GOLLAPELLI:
*నా 'నానో ' లు:*
1.దివ్వెలు
దీపావళి
సౌభ్రాతృత్వం
మానవాళి
2.ఊరింపు
ఊరడింపు
పబ్బం
పదవి
3.రగడ
మనుగడ
ఇంపు
ఫిరాయింపు
4.సిద్ధాంతం
రాద్ధాంతం
అధికారం
మమకారం
5.దిగజారడం
వ్యక్తిగతం
మండూకం
రాజకీయం
ప్రజాకవి మనసినారె
నిజానికి నింగిలో తారే
ఆయన్నెవరూ అందుకోరే
ఎగిరి చూడర ఓ మారు వెర్రి బ్రదర్!(ఇదీ తెలుగు దేశం-రాఖీ)
కరినారం వా సినారె!
వాసి గీతాల్రాసినారె!!
జ్ఞానపీఠం
ఎక్కేసినారె!!!(సంగీత గీత-రాఖీ)
అయారే! కరినగరి సినారె!!
అద్భుత గీతాలెన్నొ రాసినారె
తెలుగు గజళ్ళకు ప్రాణం పోసినారె
ధర్మపురి నరహరి(నానీ ధర్మపురి నరహరి శతకం-రాఖీ)
నింగికెగసినారె
మన సినారె
ధృవతారే
ఆ కవిరేడుకి జోహారే!(నా నానా నానీలు-రాఖీ)
॥రాఖీ॥నా నానీలు
1.అన్నీ అమర్చుకున్నావ్
ఇక ఇప్పుడు
నీ దగ్గర లేని దొకటే
సమయం
2.స్నేహితులు
బంధువులు
అందరూ ఉన్నారు
నీకు నీవు తప్ప!
3.విర్రవీగుతున్నావ్ కదూ
నింగీనేలా
వినయం సహనం
చాటుతున్నట్టు లేవూ!
4.గొంగళి పురుగే
రంగూ రూపూ మార్చుకుందే
కాకి మాత్రం
కోకిల కాలేదా?
5.అయ్యో
వాడి తల కనబడదేం?
వెతలలో
కూరుకపోయిందేమో!
నా నానా నానీలు-రాఖీ
వి’నో’దం
వి’షా’దం
మారితే ఒకే అక్షరం
ఏమాఱితే మూల్యం జీవితం
మంచితనమంటే
“ ధార పోయడం ”
శ్రమ, సమయం, ధనం
ఏదైనా-అన్నైనా
కాశ్మీరు షాలువైనా
చీపైన కర్చీఫైనా
అల్ప సంతోషి కవి
ఏం ట్రాజెడీ?!
కత్తి మీకిస్తే
గుండెనూ కోసేయవచ్చు
తిండానికి
పండునూ కోసీయవచ్చు
అవును తిండి ఇద్దరికీ
సమస్యే
ఒకడికి దొరక్క?
మరొకడికి అరక్క!
కరెంటు పోయిందా
ఎంత భాగ్యం!
ఇక ఖరీదు తక్కువ
క్యాండిల్ లైట్ డిన్నరే!!
ఓటర్లు
జూదర్లు
తాయిలాలు తాయిలాలే
పంచే డబ్బూ సారా పప్పుబెల్లలే!
మావా అంటే
ఎక్కడైనా అనుకో
నాకు
వంగతోట ఉంటే కదా?!
ఏ మున్సిపాల్టీ వాళ్ళు
మట్టు బెడతారు?
ఈ ఉగ్రవాదపు
పిచ్చి కుక్కల్ని!
రైతేల రాజు?
పెట్టుబడిని
గిట్టుబడిని
తూచలేని తరాజు!
ఆశ దోశ
అప్పడం వడ
రేట్లు చూస్తే
గుండెల్లో దడదడ!
పండగే!
గారెలూ బూరెలూ సరే
అక్కలూ బావలూ తయారే
సంతోషం జాడ?
ఊసరవెల్లులు
గుడ్లగూబలు
గబ్బిలాలు
కేరాఫ్ రాజకీయాలు
రాజకీయాల
రసవద్ఘట్టం!
ద్రవ్యోల్బణానికి
దగ్గరి చుట్టం!!
ఉగ్రవాదం
వాస్తవ నరమేధం
ప్రతిబింబింప
జేయలేని పదం
సిగరెట్టు
రేటు గుండెలదిరెటట్టు
చేస్తే పెంచేట్టు
మరి తాగితే ఒట్టు
అవ్వొచ్చు జూదం
తత్కాల మోదం
క్లైమాక్స్ మాత్రం
సదా విషాదం
మున్ముందర
పడితే తొందర
కాదా బ్రతుకే
చిందర వందర
మనిషి మనుగడ కెన్ని
ప్రతిబంధకాలు!
కుల,మత,ప్రాంత
కందకాలు!!
'నీవు' లేకుండా పోవడం
కాదు చావు!
ఆత్మ నశ్వరమను మాట
మరిచావు!!
మనసున్న చోటే
మందలింతలు!
అభిమానముంటేనే కదా
అక్షింతలు!!
Comments
Post a Comment