కరిగించే మా కండబలం మా కార్చిన ఘర్మజలం ప్రపంచైక్య కార్మికులం మేడే లాల్ సలాం..! #రాఖీ రవ్వలు పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వలు ఇదా జీవితం.! ఇదీ జీవితం., ఇదో జీవితం?! ఇదే జీవితం..!! #రాఖీ రవ్వలు చీరను పట్టిచూడు కుండను కొట్టిచూడు గుండెను తట్టిచూడు గీటురాళ్ళే అన్నీ..! #రాఖీ రవ్వలు తెలిసి వస్తే తెలివి వస్తే తెరలుతొలిగితే ఉగ్రవాద విరోధం..! #రాఖీ రవ్వలు* వాహ్ఁ., మనం మనవామన కవనం రూపుకొంచం భావన ఘనం..! #రాఖీ రవ్వలు ఓ సీత ఓ భూమాత ఇంట్లోనే సహనశీలి ఇల్లాలు! #రాఖీ రవ్వలు ఓంకారం జగతికి శ్రీకారం ప్రగతికి ప్రాకారం ప్రకృతికి నమస్కృతి గణపతికి..!! #రాఖీ రవ్వలు రవ్వ దోస రవ్వ కేసరి రవ్వల నెక్లెస్.. రవ్వలే రవ్వలు..! పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వలు ఆకలి తీర్చే మెతుకులు చేజాచనీయని ఖర్చులు సేదదీర్చెడి ఆరడుగులు బ్రతుకున పసిడి గనులే..! #రాఖీ రవ్వలు ఆదరిస్తే అమ్మలు ప్రదర్శిస్తే బొమ్మలు పద్ధతికి పట్టుగొమ్మలు భారతీయ పడతులు..! #రాఖీ రవ్వలు రవ్వలు బ్రతుకు దివ్వెలు ఐతేనె సార్థకత.. కవనమంటే జీవనమే..!! మట్టి అక్షరాలు మలిస్తే శిల్పాలు ఏ...
Comments
Post a Comment