ఆకలి తీర్చే మెతుకులు

చేజాచనీయని ఖర్చులు

సేదదీర్చెడి ఆరడుగులు


బ్రతుకున పసిడి గనులే..!


#రాఖీ రవ్వలు


పరిమళ పూవనం

ప్రజ్వల హవనం

ప్రకటిత జీవనం


అవిరళ కవనం..!


#రాఖీ రవ్వలు


ఆర్టీసి బలి'సీ

ఆడపిల్ల మసీ

వెరసి కసి


కాలంతో రంగెలిసి..!


#రాఖీ రవ్వ



కరిగించే మా కండబలం

మా కార్చిన ఘర్మజలం

ప్రపంచైక్య కార్మికులం


మేడే లాల్ సలాం..!


#రాఖీ రవ్వలు



బ్రాందీ షాపుకీ

గాంధీ పేరే

జాతిపిత కదా


పితృభక్తి..!!


#రాఖీ రవ్వలు



గరాటు ఏకోన్ముఖ సూచీ..

తరాజు వ్యక్తిత్వాన్ని తూచీ..

పట్టకం దృక్కోణం విస్తృత పరచీ


కాదేదీ బోధ కనర్హం..!


#రాఖీ రవ్వలు



రోజుకో మొహం

అద్దంలో చూడగ

ఊసరవెల్లిగ..


నేనూ మనిషినే..!


#రాఖీ రవ్వలు



మనసు మించని మతం

గడప దాటని కులం

మానవతకే హితం


విశ్వప్రేమ మహితం


#రాఖీ రవ్వలు




ఓ సీత

ఓ భూమాత

ఇంట్లోనే 


సహనశీలి ఇల్లాలు!


#రాఖీ  రవ్వలు


కన్నవారి సంస్మరణ

స్మృతి శాశ్వతీకరణ

సముచిత వితరణ


పురస్కార బహుకరణ..!


#రాఖీ రవ్వలు



వాహ్ఁ.,

మనం

మనవామన కవనం


రూపుకొంచం భావన ఘనం..!


#రాఖీ రవ్వలు



ఓంకారం జగతికి

శ్రీకారం ప్రగతికి

ప్రాకారం ప్రకృతికి


నమస్కృతి గణపతికి..!!


#రాఖీ రవ్వలు


పరిమళ పూవనం

ప్రజ్వల హవనం

ప్రకటిత జీవనం


అవిరళ కవనం..!


#రాఖీ రవ్వలు



కురిసే వర్షం

మెరిసే కిరణం

హరివిల్లు ఆవిష్కరణం..


ప్రకృతి చిత్రమే..!


#రాఖీ రవ్వలు


ఆదరిస్తే అమ్మలు

ప్రదర్శిస్తే బొమ్మలు

పద్ధతికి పట్టుగొమ్మలు


భారతీయ పడతులు..!


#రాఖీ రవ్వలు



ఇదా జీవితం.!

ఇదీ జీవితం.,

ఇదో జీవితం?!


ఇదే జీవితం..!!


#రాఖీ రవ్వలు


మట్టి అక్షరాలు

మలిస్తే శిల్పాలు

ఏమరిస్తే శిథిలాలు


నైపుణ్యం సాంతం..!


#రాఖీ రవ్వలు



చీరను పట్టిచూడు

కుండను కొట్టిచూడు

గుండెను తట్టిచూడు


గీటురాళ్ళే అన్నీ..!


#రాఖీ రవ్వలు


తెలిసి వస్తే

తెలివి వస్తే

తెరలుతొలిగితే


ఉగ్రవాద విరోధం..!


#రాఖీ రవ్వలు*


ప్రతిభ గుర్తింపు

ప్రావీణ్యతా ప్రశంస

పురస్కార స్వీకారం


గురుతర బాధ్యత..!


#రాఖీ రవ్వలు


పద పటాటోపం

రూప ఆర్భాటం

కాదు కవనం..


అది ఎద భావ చిత్రణ..!


#రాఖీ రవ్వలు


వాన పడ్తుంది

ఎండకొడ్తుంది

చలి పెడ్తుంది


ఎంత మంచిదో శీతాకాలం..!


#రాఖీ రవ్వలు



మరణం నాకేనా..

ప్రపంచానికీ..

నాకు సంబంధించి


ఆత్మకు చావులేదు..!


#రాఖీ రవ్వలు



మనిషి ప్రాణం

ఎంత హీనం

రెండుపళ్ళ కొలమానం.,


రివాజే ప్రభుత మౌనం..!


#రాఖీ రవ్వలు


రవివెలుగు రవ్వలు

కవిగుండె గువ్వలు

సవ్వడుల మువ్వలు


సాహితీ సూటితొవ్వలు.,రవ్వలు..!


#రాఖీ రవ్వలు


రెక్కలతో ఎగిరితే

మబ్బులదాకే

ఊహకు ఊతమెందుకు,


గగనాలనధిగమించు..!


#రాఖీ రవ్వలు


మానవత్వం కరడుగడితే

రక్తదాహం ప్రబలితే

మూర్ఖత్వం పెట్రేగితే


ఉగ్రవాద నరమేధం..!


#రాఖీరవ్వలు

Comments

Popular posts from this blog