మినీ కవితలు వీడిపోయిందెప్పుడు తిరిగి చూడు, కలల గుమ్మం ముందే కాపు కాచా., నిద్రలేమితో నీవు స్వప్నలోకం చేరరావు, ఎదురుతెన్నులతో నేను పడవ చేరని రేవు!! .
Posts
Showing posts from July, 2021
- Get link
- X
- Other Apps
నా నానా 'నానీలు' అదోవింత కాదు ఆడదే! తల తిప్పకు మెడ పట్టుకుంటుంది!! రోజూ విప్పలేని పజిల్ ! మా ఆవిడ అర్థం కాని తియ్యటి గజల్!! క్రీగంటి కాటుకా! దేవదాసు లెందరిని మాడ్చి మాడ్చి మసి చేశావో!! వేయించుకుంటారు ఒంటిపై ‘టట్టూ’ దాపరికమే లేదనేటట్టూ! సినీతార మాత్రం కాదు లోభి ఉదారంగా చూపెడుతుంది నాభి! మీకు బొత్తిగా లౌక్యం లేదండి! అందుకే కదా నిన్ను కట్టుకుంది!! ప్రేమించామని గొంతులుకోస్తారు కామాంధులు కాదంటే ఆసిడ్ పోస్తారు చెలీ నే కొన్నది నువు కట్టుకొన్నది ఆచీర నాఎదనా కట్టుకొన్నది!! మా రమా ఎపుడూ నీదయ కోరమా భవసాగరమీద మాకిక భారమా రువ్వే నవ్వులు గుభాళించే పువ్వులు! ప్రభాసించే దివ్వెలు!! ప్రేమంటే ఏమంటే ఆరని మంటే అంటుకుంటే బ్రతుకు కుంటే! తిడ్తె ప్రేమే గేలి జాలే ఈర్ష్య కీర్తెరుగుటే ఇదే థింక్ పాజిటివ్ అంటే! జానపదం ఆనం...
- Get link
- X
- Other Apps
కరిగించే మా కండబలం మా కార్చిన ఘర్మజలం ప్రపంచైక్య కార్మికులం మేడే లాల్ సలాం..! #రాఖీ రవ్వలు పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వలు ఇదా జీవితం.! ఇదీ జీవితం., ఇదో జీవితం?! ఇదే జీవితం..!! #రాఖీ రవ్వలు చీరను పట్టిచూడు కుండను కొట్టిచూడు గుండెను తట్టిచూడు గీటురాళ్ళే అన్నీ..! #రాఖీ రవ్వలు తెలిసి వస్తే తెలివి వస్తే తెరలుతొలిగితే ఉగ్రవాద విరోధం..! #రాఖీ రవ్వలు* వాహ్ఁ., మనం మనవామన కవనం రూపుకొంచం భావన ఘనం..! #రాఖీ రవ్వలు ఓ సీత ఓ భూమాత ఇంట్లోనే సహనశీలి ఇల్లాలు! #రాఖీ రవ్వలు ఓంకారం జగతికి శ్రీకారం ప్రగతికి ప్రాకారం ప్రకృతికి నమస్కృతి గణపతికి..!! #రాఖీ రవ్వలు రవ్వ దోస రవ్వ కేసరి రవ్వల నెక్లెస్.. రవ్వలే రవ్వలు..! పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వలు ఆకలి తీర్చే మెతుకులు చేజాచనీయని ఖర్చులు సేదదీర్చెడి ఆరడుగులు బ్రతుకున పసిడి గనులే..! #రాఖీ రవ్వలు ఆదరిస్తే అమ్మలు ప్రదర్శిస్తే బొమ్మలు పద్ధతికి పట్టుగొమ్మలు భారతీయ పడతులు..! #రాఖీ రవ్వలు రవ్వలు బ్రతుకు దివ్వెలు ఐతేనె సార్థకత.. కవనమంటే జీవనమే..!! మట్టి అక్షరాలు మలిస్తే శిల్పాలు ఏ...
- Get link
- X
- Other Apps
కోయిల కలహంస పాటకు ఆటకు దీటెవరు ప్రకృతి కళావేదిక ఆకులురాలితె చప్పుళ్ళు ఆశలు రాలితె వెక్కిళ్ళు చిగురిస్తాయిలే మానూ మేనూ!! వాన లోకాన పెరిగితే వరద అలిగితే కరువు కలతల వలలో కృషీవలుడు ప్రశ్నే సమాధానం..! పరిష్కారం లేని సమస్యలకు..!! బహిర్భూమి బాలికల కలే..! వసతీయలేని ప్రభుతలు మరీచికలే..!! కవులేనా కవిత్వం చెప్పడం..! వస్తువూ కవై పాఠకుల్ని పలుకరించదూ..!! వెనిజులా డబ్బు నీళ్ళప్రాయం..! చెన్నైలో నీళ్ళూ డబ్బుకన్న ప్రియం..!! ప్రశంస ఎంతో అవసరం! ఆత్మ న్యూనత నుండి ఎదగటానికి వర్షం పంట పొలంలో హర్షం రైతు జీవితంలో!! మన గమనం ఆనందంవైపు తొందరరెందుకు తడబడుతూ చేరేలోపు!!